AP: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సెజ్ సుంకాలు తగ్గించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలపై భారం పడకుండా ప్రధాని తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ఎక్సెజ్ సుంకం లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై పూర్తిగా రద్దు చేశారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ఎన్డీఏ నిరూపించుకుందని పేర్కొన్నారు.