HNK: ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నేడు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి ప్రభాకర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు, కమలాపూర్ మార్కెట్ ఛైర్మన్ తౌటం ఝాన్సీ రాణి-రవీందర్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు.