భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామంలోని రామాలయంలో శ్రీ సీతారాముల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు.