ATP: కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్లో వాల్మీకి మహర్షి, డా. అంబేడ్కర్ విగ్రహాల ఏర్పాటుకు MLA సురేంద్రబాబు శ్రీకారం చుట్టారు.రూ.50 లక్షలు తన సొంత నిధులు వెచ్చించి సర్కిల్ అభివృద్ధి, విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈ విగ్రహాలు గురువారం కళ్యాణదుర్గం ప్రజా వేదికకు చేరుకున్నాయి. త్వరలోనే వీటిని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.