SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో షుగర్, బీపీ, ఇతరత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాజు, ఏఎన్ఎం సుశీల, 104 సిబ్బంది ఉష, తదితరులు పాల్గొన్నారు.