HNK: వేయిస్తంభాల దేవాలయ ప్రాంగణంలో కాకతీయ సామ్రాజ్య మహారాజు ప్రతాపరుద్ర దేవుడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు హాజరై మాట్లాడారు. ఎంతో ఘనకీర్తి పొందిన ప్రతాపరుద్రుడి చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి రానున్న తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.