NLR: గుడ్లూరుకు చెందిన దేవరకొండ వెంకాయమ్మ బంగారు బ్రాస్లెట్ను బుధవారం ఆర్టీసీ బస్సులో మర్చిపోయింది. వెంటనే గుడ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయ్యగా.. బస్సు కండక్టర్ బ్రాస్లెట్ను గుర్తించి భద్రపరచి పోలీసులకు అప్పగించారు. పోలీసులు వెంటనే గోల్డ్‌ను బాధితురాలికి అందజేశారు. కండక్టర్ నిజాయితీకి వెంకాయమ్మ కృతజ్ఞతలు తెలుపగా, పోలీసులు వారిని సత్కరించారు.