TG: మంచిర్యాల జిల్లా కోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకుల అరెస్టుకు సంబంధించి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. పిటిషన్పై ఇప్పటికే బాల్కసుమన్ అడ్వకేట్ల బృందం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే రిమాండ్లో ఉన్న నేపథ్యంలో కస్టడీకి ఇవ్వకుండా బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరినట్లు న్యాయవాదులు తెలిపారు.