TG: బీజేపీలో దక్షిణాది రాష్ట్రాలకు గుర్తింపు లేదని CM రేవంత్ విమర్శించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును రాష్ట్రపతి ఎందుకు చేయలేదని, హోంశాఖను దక్షిణాది వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో దక్షిణాది వారు రాష్ట్రపతులయ్యారని గుర్తు చేస్తూ.. బీజేపీలో రాజకీయ వివక్ష తీవ్రంగా ఉందని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలపైనే బీజేపీకి నమ్మకం లేదని ఆయన ఎద్దేవా చేశారు.