TG: అంబేద్కర్ ఓవర్ సీస్ పథకం, మహాత్మజ్యోతి పూలే స్కాలర్ షిప్ పథకంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వం 4,944 మందికి రూ.607.4కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం 520 మంది SC, ST, BC, మైనార్టీ విద్యార్థులకు రూ.53.26కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. వీలైనంత త్వరగా చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.