W.G: నరసాపురం-మాధవాయపాలెం ఫెర్రీ వేలం పాట ఈ నెల 26న గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఉదయ 11.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం.నాసరురెడ్డి తెలిపారు. నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలం పాటకు సంబంధించి నోటిఫికేషన్ పేర్కొన్న మార్గదర్శణాలు, నిబంధనలు పాట దారులకు వర్తిస్తాయన్నారు.