ASR: ఆత్మ పథకంలో భాగంగా వరిలో మేలైన యాజమాన్య పద్ధతులపై మంగళవారం శింగవరంలో రైతులకు శిక్షణ నిర్వహించామని ఏవో పీ.శివరామ్ ప్రసాద్ తెలిపారు. రైతులు, మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నేరుగా వరి విత్తే విధానం, ఎరువుల వాడకం, కలుపు నివారణ, తెగుళ్లు, పురుగుల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వీఏఏ కల్యాణి పాల్గొన్నారు.