NRPT: ఊట్కూరు మండలం బిజ్వార్ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా జిల్లా స్థాయి భజన పోటీలు మంగళవారం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భజన బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలకు ప్రవేశ రుసుము లేదని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు శ్రీరామనవమి రోజున బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.