ప్రకాశం: హనుమంతుని పాడు ఎస్సై మాధవరావు విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వేములపాడు రోడ్డుపై మంగళవారం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటూ ఈ-చలాన్లు జారీ చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, పత్రాలు లేని వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.