కోనసీమ: కె.గంగవరం మండలం ముసకపల్లి గ్రామంలో మంగళవారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.