HNK: జిల్లాలో మే 11వ తేదీ నుంచి జనగణన ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఇవాళ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జనగణన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు అదనంగా టెక్నికల్ అసిస్టెంట్లను నియమించినట్లు ఆమె వెల్లడించారు. జనగణనకు సంబంధించిన అంశాలపై మూడు రోజులపాటు అవగాహన కల్పించి తుది పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు.