SRCL: వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ను మంగళవారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులు, నమోదైన కేసుల వివరాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తులో ఎటువంటి అలసత్వం వహించరాదని, పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు.