VKB: టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. TBకి పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో ఉందని, లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.