KDP: పేదలకు ఆపన్నహస్తంగా సీఎం సహాయనిధి నిలుస్తోందని నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్ మోహన్ రాజు అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో 65 మంది అనారోగ్య బాధితులకు రూ.1.15 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, చమర్తికు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.