KRNL: అసెంబ్లీ, ఎంపీ స్థానాల పెంపు నిర్ణయంపై ఆదోని జిల్లా సమితి కన్వీనర్ నూర్ అహ్మద్ ఇవాళ హర్షం వ్యక్తం చేశారు. ఆదోని కేంద్రంగా కొత్త పార్లమెంట్ స్థానం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా ఆధారంగా ఆదోని నియోజకవర్గాన్ని రూరల్, అర్బన్‌గా విభజించాలని కోరారు. ఆదోని జిల్లా సాధన కోసం గత ఆరేళ్లుగా చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు.