MHBD: ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటోత్ రామచంద్రనాయక్ ఈరోజు HYD అసెంబ్లీ చాంబర్లో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యలు, చెక్ డ్యాముల పునరుద్ధరణ, సాగునీటి కొరత వంటి కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.