SKLM: కొత్తూరు మండల కేంద్రానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ ప్రతినిధి టోంపల తిరుపతిరావు ఇటీవల అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.