RR: అహ్మదాబాద్లో జరిగిన ఆల్ ఇండియా డెఫ్ నేషనల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి పాల్గొన్న 21 మందిలో 17 మంది 13 పతకాలు సాధించారని ఫౌండర్ వినోద్ తెలిపారు. అండర్-18 విభాగంలో చందన్, రాజశేఖర్ వరల్డ్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించడం విశేషం. వీరి ప్రతిభను క్రీడాభిమానులు అభినందిస్తున్నారు.