ATP: గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హై స్కూల్‌ను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల సమస్యల గురించి ఆరా తీశారు. అలాగే, నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.