NRPT: దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి గ్రామ శివారులో సోమవారం రాత్రి భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించబడింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రథాన్ని లాగేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు, పలువురు నాయకులు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయ పరిసరాలు శోభాయమానంగా మారిపోయాయి.