గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ సెట్లో గాయపడటంతో ఆయన కంటికి శస్త్రచికిత్స జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు చిరంజీవి కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ పోస్ట్ చేశారు. ‘చరణ్ కనురెప్పకు మీరు సకాలంలో చేసిన సర్జరీ మాకు వరంలాంటిది. మీ నైపుణ్యం మా ఆందోళనను దూరం చేసింది’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం చరణ్ కోలుకుంటున్నట్లు సమాచారం.