ATP: గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థుల ఆధ్వర్యంలో ‘తరంగిణి 2026’ ఉగాది వేడుకలు గురువారం జరిగాయి. ఈ కార్యక్రమానికి అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరాయి ప్రాంతాల్లో ఉన్నా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఉత్సాహంగా పండుగ జరుపుకోవడం అభినందనీయమని ఆయన కొనియాడారు.