SRPT: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఈ రోజు కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ విన్నతులపై తక్షణం స్పందిస్తూ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని కోరారు.