అహ్మదాబాద్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో కలిసి ఆయన T20 ప్రపంచకప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న పిచాయ్.. ఈ విధంగా క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.