NLR: ఇందుకూరుపేట(మం) గంగపట్నం పల్లిపాలెంలో బ్రిడ్జి లేక ప్రజలు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలె ఓ మృతదేహాన్ని నడుము లోతు నీటిలో, బురద మార్గంలో థర్మాకోల్ షీట్‌పై తరలించాల్సి వచ్చింది. బ్రిడ్జి లేక జీవితం నరకంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన విషయం తెలిసిందే.