నేడు న్యూజిలాండ్ తో టీమిండియా రెండో వన్డేలో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ లో భారత పేసర్లు పోటాపోటీగా వికెట్లు పడగొడుతున్నారు. కేవలం 15 పరుగులకే 5 వికెట్లను పడగొట్టారు. పేసర్ మహ్మద్ షమీ న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
మొత్తంగా ఇప్పటి వరకూ మహ్మద్ షమీ 3 వికెట్లను పడగొట్టాడు. సిరాజ్ ఒకటి, పాండ్యా చెరో వికెట్ ను పడగొట్టారు. డ్రింక్స్ విరామ సమయానికి కివీస్ 14 ఓవర్లలో 28/5 స్కోరు చేసింది. డ్రింక్స్ బ్రేక్ తర్వాత శార్దూల్ ఠాకూర్ మరో వికెట్ తీశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 23 ఓవర్లకు 67/6గా ఉంది.