VZM: సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కవులు, కళాకారులు సాహితి వేత్తలు రథసారదులవ్వాలని పూర్వ నేషనల్ న్యాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి సత్యనారాయణ పిలుపునిచ్చారు. చైతన్య భారతి 380వ సభకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. కళా రంగంలో 40 ఏళ్లగా చేసిన సేవలకు బుర్రకథ కళాకారుడు పిరిడి జగన్నాథముకు ‘బుర్రకథ స్టార్ జూనియర్ కుమ్మర మాస్టర్’ బిరుదును ప్రధానం చేశారు.