కామారెడ్డి జిల్లాలో నిన్న ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణులు కాళికాదేవి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉగాది సందర్భంగా పలు గ్రామాల్లో ఎడ్ల బాండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రారంభించారు.