VZM: ఓటరు జాబితా సవరణకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని గజపతినగరం ఇంఛార్జ్ తహసీల్దార్ సిహెచ్ శోభారాణి కోరారు. బుధవారం గజపతినగరం తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు జాబితా పై రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎవరైనా షిఫ్టింగ్ అయినా, మృతి చెందిన వారి పేర్లను తొలగించడంతోపాటు ఏమైనా చేరికలు ఉంటే చెప్పాలని సూచించారు.