MDK: ప్రజలు పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి అన్నారు. పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్లో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని ప్రజలకు పలు సూచనలు చేశారు. కులమతాలకు అతీతంగా సోదరభావంతో పండుగలను జరుపుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సీఐ సూచించారు. పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.