ELR: కళాశాలకు వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీలుగుమిల్లికు చెందిన విద్యార్థిని అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతోంది. 3రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై వి. క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు