SRPT: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. ఇళ్ల వద్దనే తడి, పొడి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా రీసైక్లింగ్ ప్రక్రియ సులభతరం అవుతుందని అన్నారు. ప్రపంచ రీసైక్లింగ్ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీకి సంబందించిన జమునా నగర్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు.