W.G: ఉండి బస్టాండ్లో బుధవారం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. గత డిసెంబర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుకగా ఈ పథకాన్ని అందించిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.