కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాలను బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అధికారులు సిబ్బందితో మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా వసతులు సక్రమంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.