ASR: పోలవరం ప్రాజెక్టు కారణంగా రంపచోడవరం నియోజకవర్గంలోని అనేక గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఉగాది కానుకగా నిర్వాసితులకు 3వ విడత ఆర్&ఆర్ పరిహారంగా రూ.250 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబు అమరావతిలో అందించారు. చింతూరు డివిజన్‌కు చెందిన బాధితులను ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి అమరావతికి తీసుకువెళ్లారు. సీఎం చేతుల మీదుగా వారికి పరిహార చెక్కులు అందజేశారు.