SKLM: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా బుధవారం పాల్గొన్నారు. జిల్లాలో అమలు అవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు మరింత చురుకుగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు.