వనపర్తి మండలం చిమనగుంటపల్లి సమీపంలోని తూర్పు తాండ వాటర్ ట్యాంక్ దగ్గర పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను గుర్తించి ఆపి పరిశీలించారు. పరిశీలనలో ఎటువంటి అనుమతి పత్రాలు లేనందున ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై రిషికేష్ తెలిపారు.