HYD: శామీర్‌పేటలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే హౌస్ అరెస్ట్‌లో ఉన్న ఈటల నివాసానికి పోలీసులు మరోసారి చేరుకుని బయటికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిపై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.