ATP: తాడిపత్రి మండలంలోని హుస్సేనాపురం గ్రామ ఎస్సీ కాలనీలో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు కాకర్ల రంగనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు.