TG: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి 31 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలకు అవకాశం కల్పించింది. 3 ఏళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు బదిలీలు కల్పించనుంది. ఒకేచోట నాలుగేళ్లు పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి. గరిష్టంగా 40 శాతం ఉద్యోగులకే బదిలీలు పరిమితం కానుంది.