AP: కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘నిజానికి MGNREGA అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఈ పథకాన్ని అత్యుత్తమంగా అమలు చేయడంలో మిగతా రాష్ట్రాలతోపాటు ఏపీ కూడా ఒకటిగా ఉండేది. కానీ కూటమి వచ్చాక వెనకపడిపోయింది. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ వ్యవస్థ దెబ్బ తింటోంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.