MLG: మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంగళవారం రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్‌తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్ తదితరులు ఉన్నారు.