VKB: బంట్వారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపుల్లోని స్టాక్ రిజిస్టర్లను, విత్తన నిల్వలను ఆయన పరిశీలించారు. రైతులకు విత్తన కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్లు రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను కలెక్టర్ హెచ్చరించారు.