KMM: నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాలలో రైతుల విజ్ఞప్తి మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రకటించారు. కావున రేపు ఉదయం 10 గంటలకు మంత్రి క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జి ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.