గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ వయసు ప్రస్తుతం 40 ఏళ్లు. కానీ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లో 21 ఏళ్ల కుర్రాడిగా మారబోతున్నాడట నితిన్. దాంతో ఇప్పటి నుంచే ఆ ప్రాజెక్ట్ పై హైప్ క్రియేట్ అవుతోంది. అది కూడా హిట్ కాంబినేషన్ కావడంతో.. ఈ న్యూస్ వైరల్‌గా మారింది.
I am a hero because of him.. Nitin comments are viral
గత కొన్నాళ్లుగా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు నితిన్ (Nitin). ప్రస్తుతం అల్లు అర్జున్ నటివచిన ‘నా పేరు సూర్య’ సినిమాతో మెగా ఫోన్ పట్టిన రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే భీష్మతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రజెంట్ సెట్స్ పై ఉన్నాయి. అయితే ముందుగా వక్కంతం వంశీ సినిమా ఆడియెన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా పై నితిన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమాకు ‘ఎక్స్ట్రా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
దానికి క్యాప్షన్‌గా ఆర్టీనరీ మ్యాన్ అని యాడ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. ఈ సినిమాలోనే నితిన్ నితిన్ 21 ఏళ్ల కుర్రాడిగా కనిపించనున్నారట. కథ ప్రకారం ఈ సినిమా ప్లాష్‌బ్యాక్‌లో నితిన్ యంగ్ లుక్‌లో కనిపిస్తారట. ఇందుకోసం వీఎఫ్ఎక్స్ సహాయంతో నితిన్ లుక్‌ను సహజంగా చూపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఈ ఎపిసోడ్ సినిమాలో హైలెట్‌గా ఉంటుందని అంటున్నారు. గతంలో వెంకీ కుడుములతో నితిన్ చేసిన ‘భీష్మ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందుకే.. ఈ కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే 2020లో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు నితిన్. చెక్, రంగ్‌దే, మాస్ట్రో, మాచర్ల నియోజక వర్గం సినిమాలు సరైన విజయాలు అందుకోలేకపోయాయి. రంగ్‌దే సినిమా పర్వాలేదనిపించినా.. మిగతా సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు నితిన్. మరి ఈ సినిమాలతో నితిన్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.